నిజామాబాద్, జూన్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం -2023 సందర్భంగా సన్నాహక కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో 17 జూన్ ఉదయం 6గంటలకు ‘‘యోగా వాక్’’ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమం గాంధీ చౌక్‌లో ప్రారంభమై, కలెక్టర్ గ్రౌండ్‌లో ముగుస్తుందన్నారు. మార్గమధ్యంలో యోగా సాధకులు యోగాసనాలు ప్రదర్శనలు చేస్తారన్నారు. కార్యక్రమంలో యోగా సాధకులు,యువతీయువకులు, పిల్లలు,పెద్దలు అందరూ పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానించారు.