ధర్పల్లి జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ భూపతి రెడ్డి విచ్చేసి మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఇంటింటికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని కార్యకర్తలకు దీమా కల్పించారు.
ఎవరైనా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, అలాగే పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి గడపగడపకు చేరువేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, టిపిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, ధర్పల్లి మండల అధ్యక్షులు చిన్న బాలరాజు, జక్రాన్ పల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు సోప్పరీ వినోద్, దర్పల్లి యూత్ అధ్యక్షులు మధు, భూపతిరెడ్డి యువసేన అధ్యక్షులు రమేష్ నాయక్, ప్రెసిడెంట్ రమణ, సీనియర్ కార్యకర్తలు యువజన విభాగం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.