బాన్సువాడ, జూన్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్ ఆస్పత్రి డాక్టర్ తోటవారి కిరణ్ కుమార్ తన తోటి డాక్టర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని సమాజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను మానసికంగా అరుణంగా ఉండేలా తీర్చిదిద్దమే కాకుండా విద్యార్థులకు శారీరిక వ్యాధులు మానసిక వికాసం కోసం దేశభక్తి గేయాలు సాంస్కృతి సాంప్రదాయాలు మేలవించేలా చక్కని విద్యా బోధన అందిస్తున్న పాఠశాలకు తమ వంతు బాధ్యతగా చిన్నారులకు క్రీడా వస్తువులు అందజేయడం జరిగిందని వారు తెలిపారు.
కార్యక్రమంలో నాగులగామ వెంకన్న, గుడాల నాగేష్, డాక్టర్లు కిరణ్ కుమార్, డాక్టర్ సంతోష్ రెడ్డి, రాజశేఖర్, సాయి లీల, సంగ్రం రాథోడ్, రతన్ సింగ్, శిరీష, మోహన్ రెడ్డి దినేష్ రంజన్, దేవిసింగ్, పాఠశాల ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.