ఆర్మూర్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన డీ ఆర్ ఆర్ శశాంక్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా మెరుగైన వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించాలని అతడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని ఆశ్రయించారు. వెంటనే ఆయన సీఎం ఆర్ ఎఫ్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి రెండు లక్షల రూపాయల ఎల్ వో సీని మంజూరు చేయించారు. జీవన్ రెడ్డి ఆదివారంవారం ఎల్వోసీ చెక్కును అందజేశారు. శశాంక్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఎల్వోసీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.