నిజామాబాద్, జూన్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలంలోని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయంలో జరిగిన హరినామ చింతన కార్యక్రమంలో నర్సింహా రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు పమిడికాల్వ మధుసూదన్‌చ, విశిష్ట అతిథిగా ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇందూరులో అన్నమయ్య మళ్లీ పుట్టాడని, నాడు అన్నమయ్య ఏడుకొండల వాడిపై ఏ ఆర్తితో కీర్తనలు రాసాడో అదే ఆర్తి నర్సింహ్మా రెడ్డి కీర్తనలో కనబడుతుందన్నారు. ప్రతి కీర్తనలో ఆధ్యాత్మికతతో పాటు సమాజహితం కూడ ఉందన్నారు. నర్సింహా రెడ్డి ఇందూరుకు దొరికిన గొప్ప వరం అని జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ అన్నారు. భవిష్యత్తులో నర్సింహ్మా రెడ్డి మన జిల్లాకు గొప్ప ఆధ్యాత్మిక సంపదగా మారుతారని అన్నారు. ఆలయ ఆస్థాన గాయకులు నర్సింహా రెడ్డి విరచించిన కీర్తనలు పాడగ ప్రముఖ సాహితీ వేత్తలు కాసర్ల నరేష్, చందన్ రావు, ఆరుట్ల శ్రీదేవి, సిని నటులు రవి, పంచరెడ్డి లక్ష్మణ్‌లు కీర్తనలపై విశ్లేషణ చేశారు.
ప్రముఖ వేణు గాన విద్వాంసులు ‘‘పాడుత తీయగ’’ ఫేం యుగంధర్ తన మురళితో ‘‘ఇందూరు అన్నమయ’’ కీర్తనలను వాయించి ఆహుతులను వినోదపరిచారు. వర్ధమాన సంగీత దర్శకులు, గాయకులు విజయ్ ఐలేని తమ గానామృతంతో శ్రోతలకు వీనులవిందు పంచాడు. ఆలయ ఆస్థాన గాయకులు సాత్విక, నందిని, మహేష్, నగ్మ, భువనకృతి ‘‘ఇందూరు అన్నమయ’’ విరచించిన కీర్తనలను పాడి ఆహుతులను భక్తి భావనలో ఓలలాడిరచారు.
హరిదా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కాసర్ల నరేష్ రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో పమిడికాల్వ మధు సూదన్, జడ్పిటిసి బాజిరెడ్డి జగన్, సన్మాన గ్రహీత ‘‘ఇందూరు అన్నమయ’’ నర్సింహ్మా రెడ్డి, ఎంపిటిసి రాములు, ఉప సర్పంచ్ రాజేశ్వర్, నరాల సుధాకర్, రవిందర్ యాదవ్, నర్సా రెడ్డి, ప్రసాద్, దేవేందర్, చందన్ రావు, పంచరెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.