కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పే రివిజన్‌ కమిటీని నియమించి జూలై నుండి పెన్షన్‌ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, బకాయి పడ్డ డిఏ లను వెంటనే విడుదల చేయాలని , ఈ కుబేరులో పెండిరగ్‌ లో ఉన్న బిల్లులకు నగదు చెల్లించాలని,?398 రూపాయలతో పని చేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.

పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు. వైద్యం అన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతించాలని, మెడికల్‌ బిల్లులను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారంగా నెల రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. మెమోరాండాన్ని కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ గారికి సమర్పించారు. కార్యక్రమంలో పెన్షనర్ల నాయకులు కే. రామ్మోహన్రావు, మదన్మోహన్‌, ఈవిల్‌ నారాయణ, సుదర్శన్‌ రాజ్‌, శిర్ప హనుమాన్లు, అందే సాయిలు, లావు వీరయ్య ముత్తారం నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »