కామారెడ్డి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
దీంతో పట్టణ కేంద్రానికి చెందిన వ్యాపారి రాకేష్ మానవతా దృక్పథంతో స్పందించి 13వ సారి రక్తదానం చేయడం జరిగిందన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని రక్త దానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కేబిసి రక్తనిధి కేంద్రం నిర్వాహకులు జీవన్, సంతోష్ వెంకట్ పాల్గొన్నారు.