డిచ్‌పల్లి, జూన్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 8847 మంది విద్యార్థులకు గాను 8221 మంది హాజరయ్యారని, 620 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 3వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 10,461 మంది నమోదు చేసుకోగా 9699 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 762మంది విద్యార్థులు గైరాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ తెలుగు పరీక్షలో ఇద్దరు విద్యార్థులు డిబార్ కాగా, ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో ఒకరు, స్టాటస్టిక్స్ సబ్జెక్టులో ఇద్దరు విద్యార్థులు మధ్యాహ్నం జరిగిన మూడవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో మాల్ ప్రాక్టీస్ చేస్తూ డిబార్ అయ్యారని తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన మూడవ సెమిస్టర్ కెమిస్ట్రీ బ్యాక్లాగ్ పరీక్ష సి.ఎస్.ఐ డిగ్రీ కళాశాల నిజామాబాద్ నందు నలుగురు విద్యార్థులు డిబార్ అయ్యారని సిఓఇ ఒక ప్రకటనలో తెలిపారు.