డిచ్‌పల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఏ 2వ, 4వ, 6వ సెమిస్టర్స్ రెగ్యులర్‌కు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో జూలై 10వ తేదీ నుండి ప్రారంభమై జూలై 25వ తేదీ వరకు కొనసాగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
మరిన్ని వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.