కామారెడ్డి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చంద్రకళ (78) వృద్ధురాలు అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని కామారెడ్డి బ్లడ్ సెంటర్‌లో అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు రక్తదానానికి ముందుకు రావాలని,రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడాలని రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం జరగదని అన్నారు. రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జతేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్ సంతోష్ వెంకట్ పాల్గొన్నారు.