కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ మహిళకు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 6 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారని, ఐవిఎఫ్ సేవా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా,రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, వి.టి. ఠాకూర్ రక్తనిధి టెక్నీషియన్లు చందన్, యేసు పాల్గొన్నారు.