నిజామాబాద్, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు.
యోగ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అందరం నిత్యం యోగ సాధన చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచించారు అలాగే ప్రదర్శన చేసిన వారిని అభినందించారు.
యోగ సాధకులు చేస్తున్న సాధన నిజామాబాద్‌లో విశేషంగా యోగ అవగాహనను పెంచుతున్న యోగ గురువు అభినందనీయమని, యోగ అవగాహన కోసం నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని నగర మేయర్ తెలిపారు.
సామాజిక సేవలో భాగంగా యోగ నేర్పిస్తూ యోగ ప్రచారం చేస్తున్న యోగసాధకులను ఈ కార్యక్రమంలో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, నేషనల్ టైక్వాండో ప్లేయర్ బసవ లక్ష్మీ నరసయ్య, కిసాన్ క్లాత్ ఎంపోరియం ధన్పాల్ సూర్యనారాయణ, సీనియర్ యోగ గురువులు యోగ రామచంద్ర , సిద్ధిరాములు, యోగ గురువులు అలాగే దయానంద యోగ కేంద్రం డిస్ట్రిక్ట్ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్, ఎన్‌సిసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇన్నర్ వీల్ క్లబ్, ఆరోగ్య రక్ష మరియు నెహ్రూ యువ కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.