కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈ నెల 16 వ తేది లోపు నూతన పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలిపారు.
ఈనెల 26వ తేదీ నుంచి 11వ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి శుభవార్త అందించిన తరుణంలో మండలంలో నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ త్వరగా దరఖాస్తు ఫారం నింపి నూతన పట్టా పాస్ పుస్తకం లేదా తహసిల్దార్ డిజిటల్ సంతకం చేసిన పత్రం ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా, సంబంధిత ధ్రువపత్రాలు క్లస్టర్ పరిధిలోని ఏఈఓ లకు అందించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రస్తుతం రైతుబంధు పంట పెట్టుబడి సాయం పొందుతున్న రైతులందరికీ యధావిధి గానే రైతుబంధు సాయం వారి ప్రస్తుత అకౌంట్లోనే నేరుగా జమవుతాయన్నారు రైతులేవరైనా ఇది వరకే రైతుబంధుకు అనుసంధానం ఉన్న బ్యాంక్ అకౌంట్ ను మార్చుకోవాలనుకుంటే సంబంధిత క్లస్టర్ పరిధిలోని రైతు వేదికలో ఏఈఓ లకు నూతన బ్యాంక్ ఖాతాలు అందించాలన్నారు. ప్రతి ఏడాది రెండు సీజన్లో ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. వానాకాలం పంటకాలానికి పెట్టుబడి సాయం అందిస్తున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.