కామారెడ్డి, జూన్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ట్యాగ్ లైన్ తో అంతర్జాల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలకు పరిష్కారం యోగా చేయడమే అని పేర్కొన్నారు. సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో తరుపున అంతర్జాలంలో యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి, యోగా చేపించి పాల్గొన్న వారందరికీ అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపామన్నారు.