కామారెడ్డి, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ రీజినల్ కార్యాలయంలో గురువారం కామ్రేడ్ తారక్ నాథ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్డి క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు.
సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన ఎస్బిఐ ఉద్యోగులు నేటి సమాజానికి ఆదర్శంగా నిలవడం జరిగిందని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో రక్తనిల్వలు లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని వారిని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ కుండె, ప్రాంతీయ కార్యదర్శి భాస్కర్ లు మాట్లాడుతూ కామ్రేడ్ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. వారు ఉద్యోగుల కోసం చేసిన సేవలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్, ఉద్యోగులు నరేందర్ విష్ణువర్ధన్ గౌడ్, రాంప్రసాద్, నవీన్, వెంకటేష్, మయూర్ మహేష్, దేవేందర్, శరత్, నవీన్ కుమార్, ప్రభుత్వ వైద్యశాల బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ప్రమోద్, అరుణ్, పోశెట్టి పాల్గొన్నారు.