కామరెడ్డి, జూన్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలో అమరవీరుల స్థూపానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జడ్పీ చైర్పర్సన్ శోభ, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.