కామారెడ్డిలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం సమర్థవంతంగా అందించడానికి లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా జడ్జి ఎస్‌.ఎన్‌ శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

అనుభవజ్ఞులైన న్యాయవాదుల ద్వారా పేదలకు సకాలంలో న్యాయ సహాయం అందుతుందని తెలిపారు. న్యాయం సహాయం కోరే నిరుపేదలకు నవీకరణకు దారితీసే మెరుగైన ప్రతిస్పందన, కేసుల పురోగతి ఉంటుందని చెప్పారు. న్యాయ సహాయ ప్రదాతల పక్షాన జవాబుదారీతనాన్ని నిర్ధారించడం కోసం లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం రూపొందించామని పేర్కొన్నారు.

క్రిమినల్‌ విషయాలలో న్యాయ సహాయం అందించడానికి ఈ సిస్టం దోహదపడుతుందని తెలిపారు. అరెస్ట్‌ అయిన నిరుపేద వ్యక్తులు న్యాయవాదులను పెట్టుకునే స్తోమత లేని వారికి ఈ సిస్టం ద్వారా సలహాలు ,సూచనలు అందించి సత్వర న్యాయం అందించే వీలు కలుగుతుందని చెప్పారు. లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా బి. రమేష్‌ చందు, కే. మోహన్‌ రావు, పల్లె చిరంజీవి నియమితులయ్యారు.

కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి టి. భార్గవి, ఆర్డీవో శ్రీనివాస్‌ రెడ్డి, సబ్‌ జైలు సూపరిండెంట్‌ శ్రీధర్‌, బార్‌ సోసియేషన్‌ ప్రతినిధులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పర్యవేక్షకులు చంద్ర సేన రెడ్డి, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »