వాన,
నీటిధారగా మారి
చెరువైతది,
నదిjైుతది,
సంద్రమైతది.. నిజమే కానీ
చల్లటివాన
గరమ్ ఛాjైుతది విచిత్రంగా,
నోటికింత అన్నమైతది అమ్మతనంగా,
నేలపాటకు గొంతైతది పరవశంగా,
చెట్ల ఆటకు చెలిమినిస్తది
పచ్చదనంగా,
పూలనడకకు దారినిస్తది పరిమళంగా
పక్షులాకలికి పండ్లనిస్తది
ప్రేమగుణంగా
పశువులను చేరి పాలనిస్తది
వాత్సల్యతనంగా
మనిషి ప్రగతికి
కోట్ల విలువైతది
దేవుడనంగా..
వానకు దోసిల్లు నింపి కాదు
మనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ!
రచన
కాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్
మీ కవన వనంలో విరిసిన మరో ఆణిముత్యం ఈ కవిత అభినందనలు తమ్ముడు.👍
thanks madam…
వానతో జాయ్ జాయ్
గరం చాయ్ తో హాయ్ హాయ్
మీ కవితలు కూడా పంపండి