రెంజల్, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులోని పెద్దవాగులో శుక్రవారం కోప్పర్గ గ్రామానికి చెందిన బండారి గంగాధర్ (32) చేపలు పట్టేందుకు వెళ్లి ఈత రాక మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోప్పర్గ గ్రామానికి చెందిన గంగాధర్ అదే గ్రామానికి చెందిన ఈశ్వర్,బోజన్న లతో కలిసి శుక్రవారం సాయంత్రం నీలా గ్రామ శివారులోని పెద్ద వాగులో చేపలు పట్టడానికి వెళ్లిరూ వాగులో నీరు అధికంగా ఉండటంతో చేపలు పెట్టవద్దని ఈశ్వర్,బోజన్న లు చెప్పిన వినకుండా గంగాధర్ వాగులోకి దిగి చేపలు పట్టే క్రమంలో ఈత రాక మృతి చెందాడని భార్య భారతికి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఎంత వెతికిన మృతదేహం ఆచూకీ లభించలేదు.
శనివారం ఉదయం నది వైపునకు వెళ్లిన గ్రామస్థులు నదిలో తెలియాడుతున్న మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సాయన్న సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జాలర్ల సహాయంతో బయటకు తీయించారు. మృతుడి భార్య భారతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు.