కామారెడ్డి, జూన్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నిట్టూరి యశోద భాయ్ (55) కి ఏ నెగిటివ్ రక్తం అత్యవసరంగా కావాల్సి ఉండడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ఏ,బి,ఓ,ఏబి నెగిటివ్ గ్రూపులు లభించడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని,ప్రతి ఒక్కరూ రక్తపరీక్ష చేయించుకుని రక్తానికి సంబంధించిన గ్రూపును తెలుసుకొని ఉండాలని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాత కృష్ణ స్వామికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ప్రసాద్, టెక్నీషియన్లు జీవన్, సంతోష్, వెంకట్ పాల్గొన్నారు.