తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,
పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకు
ఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త
బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లు
నా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది
వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుంది
ఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది
వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది
వారానికోసారి మా శ్రీమతి చేత దుమ్ము దులిపేసుకొని
కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై ముగ్గు దగ్గర
మా కొరకు నా భార్యలా ఎదురుచూస్తుంది
అది ఎంత శిథిలావస్థలో ఉన్న
ప్రేమతో దాని మనుగడను ప్రశ్నించలేను
రచన : కే వి రమణా చారి,
తెలుగు పండితులు, నిజామాబాద్
డోర్ మ్యాట్ ని కూడా కవిత వస్తువుగా ఎంచుకోవడం మీ విలక్షణమైన దృష్టి కోణాలు తెలియజేస్తుంది. ఇలాగే మరిన్ని కవితలు రాస్తూ ఉండండి.