బొగ్గు ముక్క నిప్పురవ్వై
విప్లవ సెగలు చిమ్మింది
గడ్డి పోచలను
కత్తిలా పదునుపెట్టిన
ఈ నేల
ఎంత పునీతమైనది
చీకటి వీపున వాతలు పెట్టి
వేకువను తట్టి లేపిన
ఆ కలానిది
ఎంతటి పదును
ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలో
తనకై తపిస్తున్న తరిస్తున్న
మహా కవిని చూడాలని
ప్రతి కవితా శరమై
ప్రతిపాట వరమై
అమవసను చీల్చి
వెన్నెలను కురిపించినయి
నవోదయానికై కలలు కన్నా
ఆ కలం
నిత్య చైతన్య రథం
మట్టికై తపించడం
మట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణం
పద్యాన్ని రaలిపించి
నిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పి
ఉద్యమించిన మహాకవి దాశరథి
తరువాత కవుల రథసారథి
డాక్టర్. శారద హన్మాండ్లు
కవయిత్రి
నిజామాబాద్