సేవా కార్యక్రమాలలో సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌

ఆర్మూర్‌, జూన్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలో గల సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలలో తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ పేదల ఆకలి తీర్చడమే కాకుండా పేద ప్రజలకు అభాగ్యులకు వస్త్రాలను పంచి పెడుతూ ఒకపక్క తన దాతృత్వాన్ని చాటుతూ ఆర్మూర్‌ ప్రజల మన్ననలు పొందుతుంది.

వీటితోపాటు చదువుపై ఆసక్తి ఉండే పేద మధ్యతరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రభాస్‌, దినేష్‌లు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఉంటాయని తమ ఫౌండేషన్‌ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకునేవారు 83413 21438 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Blog heading and website banner of laptop with female typing hands, copy space in grey color. Concept of advertisement of bitcoin and cryptocurrency, modern technology and programming.

Check Also

ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »