మేఘాలు కమ్ముకున్నాయి
అమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుంది
అమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుంది
అమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె
ఉరుములంటే
అమ్మకి బయ్యం
ఎంత భయపడుతుందో ఏమె
నాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉంది
నన్ను తడవకుండా చూస్తుంది
ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయి
ఆకాశం ఉరిమినప్పుడల్లా
అర్జునా పాల్గునా అనుకో అమ్మ
భయమేయదు
నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మ
ప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని
డా.మద్దుకూరి సాయిబాబు
నిజామాబాద్