గ్రామ దేవతలకు జలాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రజా ఐక్య వేదిక సర్వసమాజ్‌ అధ్వర్యంలో ఆర్మూర్‌ లోని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని, గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ గ్రామ దేవతలను మొక్కుకున్నామని తెలిపారు.

కార్యక్రమంలో సదర్లు జాగీర్దార్‌ శ్రీను, గోజూరు శ్రీను, సర్వ సమాజ్‌ ప్రధాన కార్యదర్శి కర్తన్‌ దినేష్‌, ఉపాధ్యక్షులు,కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు, సర్వసమాజ్‌ సభ్యులు, సదరులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »