నిజామాబాద్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి కాపాడుకోవడానికి ఏకైక మార్గం ఆ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడటమేనని అందుకే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జయని నెహ్రూ అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించినట్లయితే వైద్యం ద్వారా నయం చేసుకోవచ్చని ఆమె అన్నారు.
సోమవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అండ్ ఆల్ పెన్షనర్స్ యూనియన్ సంయుక్తంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలోని ట్రస్ట్ భవనంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు. క్యాన్సర్ నిర్ధారిత పరీక్షలైన మెమోగ్రఫీ, ఎక్సరే, పాప్సనియర్ తదితర టెస్టులను ఉచితంగా చేయటం జరిగింది. దీనితో పాటు బీపి, షుగర్, గుండె వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ స్నేహ, తదితర వైద్య సిబ్బంది, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది క్యాంపుకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు సరఫరా చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రిరావు, ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, కోశాధికారి ఈవిల్ నారాయణ, ప్రసాద్ రావు, అందే సాయిలు, జార్జ్, దీనసుజన, గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు 150 మంది ఈ హెల్త్ క్యాంపులో టెస్ట్స్ ,వైద్యం, చికిత్స పొందారు.