ఆర్మూర్, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా మాసోత్సవాల సందర్భంగా సోమవారం ప్రత్యేక ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ యూనిట్ అధికారి సాయి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున ఖాళీ స్థలాలలో నీటి నిల్వలు ఏర్పడి దోమ లార్వా వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ, చికును గున్యా, ఫైలేరియా వంటి వ్యాధులను కలుగజేస్తాయన్నారు.
ఇంటి ఆవరణలో మరియు చుట్టూ ప్రదేశాలలో పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత డబ్బాలు, కూలర్లు, పాత వస్తువులను ఉంచుకోరాదని వారానికి ఒక్కసారి ఫ్రైడే ను డ్రైడేగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రవీందర్, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్, ఆశా కార్యకర్తలు నవ్య, రమ, శిరీష, సుభద్ర, మమత తదితరులు పాల్గొన్నారు.