కామారెడ్డి, జూన్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదిరాజుల జోలికి వస్తే ఏ రాజకీయ పార్టీలైన, ఆ పార్టీలకు చెందిన ఏ రాజకీయ నాయకుడైనా సరే వారిని రాజకీయంగా సమాధి చేస్తామని ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు గజ్జల బిక్షపతి ముదిరాజ్, నంద రమేష్ ముదిరాజ్, చింతల గోపి ముదిరాజ్, దేవుని సూర్యప్రసాద్ ముదిరాజ్, పిల్లి యాదగిరి ముదిరాజ్, భార్గవ్ రవీంద్ర భూపాల్ ముదిరాజ్ లు హెచ్చరించారు.
సోమవారం వారు కామారెడ్డిలోనీ ముదిరాజ్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజురాబాద్‌లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఒక జర్నలిస్టును కిడ్నాప్ చేసి త్రివరంగ చితకబాదడంతో పాటు ముదిరాజ్ ముదిరాజ్ కులస్తులందరిని పరుష పదజాలంతో దూషించడం క్షమించరానిదని, కౌశిక్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
ముదిరాజ్ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని వారు డిమాండ్ చేశారు. ముదిరాజులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని వారు పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బాధితులు ఎవరికైన తమ అడ్వకేట్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. అధికార మదం, డబ్బు పొగరుతో ముదిరాజులపై దాడి చేస్తే ఎంతటి వ్యక్తులు నైనా వదిలే ప్రసక్తి లేదని వారు హెచ్చరించారు.