బాల్కొండ, జూన్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజీక వర్గ కేంద్రంలో ప్రధాన మంత్రి మేరా బూత్ సబ్సె మజ్బుత్ ప్రసంగాన్ని బాల్కొండ బి.జే.పి శ్రేణులు తిలకించారు. మంగళ వారం ఉదయం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ భోపాల్ లో ‘‘మేరా బూత్ సబ్సె మజ్బుత్’’ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి టి.విల్లో ప్రసంగించారు.
కార్యక్రమాన్ని టి.వి ద్వారా బాల్కొండ మండల కేంద్రంలో బిజెపి నాయకులు వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మం, అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆరెపల్లి నర్సయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు పిప్పెర వినోద్, గౌరు శివానంద్, ఉట్నూర్ రాంకిషన్, మగ్గిడి లింగం, బాపూరావు తదితరులు ఉన్నారు.