కామారెడ్డి, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆర్కె కళాశాల, వాసవి క్లబ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్‌ల ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే కళాశాలల సీఈవో జైపాల్ రెడ్డి, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, వాసవి క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో చాలామంది పేద మధ్య తరగతికి చెందిన పేషెంట్లు రావడం జరుగుతుందని వారికి మానవతా దృక్పథంతో సేవలను అందించాలని అన్ని వృత్తుల్లో కెల్లా డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైనదని కొందరు డాక్టర్లు సమాజంలో ధనార్జన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకాన్ని కలిగించడమే కాకుండా ఎంతో బాధ్యతతో విధులు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గౌడ్,చిన్నపిల్లల డాక్టర్లు విజయరాజ్, పవన్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాయిలు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సాయి అశోక్‌లను సన్మానించారు.
కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, కల్కి మానవ సేవా సమితి నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్, ఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ సైదయ్య, నవీన్ ఎస్ ఆర్ కె కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి శివకుమార్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, రమణ, నాగసాయి పాల్గొన్నారు.