వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

హైదరాబాద్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా. రైతులకు ఇబ్బంది కలగకుండా వానాకాలం సాగుకు సాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అంశంపై ఆదివారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారని మంత్రి వెల్లడిరచారు.

సీఎం కేసిఆర్‌ సమీక్ష సమావేశం అనంతరం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ సెక్రటేరియట్‌ లో ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటకు సాగునీరు అందించే అంశంపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. ఎల్‌ ఎండి ఎగువ భాగం ఆయకట్టు కు సాగునీరు అందించేందుకు 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా ఉండగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ లో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని చెప్పారు.

రైతుల శ్రేయస్సు దృష్ట్యా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎస్సారెస్పీ పునరుజ్జీవం లో భాగంగా కాళేశ్వర జలాలు రోజుకు 0.5 టిఎంసి చొప్పున 60 రోజుల్లో 30 టిఏంసిలు లిఫ్ట్‌ చేసి ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌ లో నింపాలని నిర్ణయించారని తెలిపారు. నీటిని లిఫ్ట్‌ చేయడానికి సంబంధించిన మూడు పంపుహౌజ్‌లు సిద్దం చేయాలని సి.ఈ సుధాకర్‌ రెడ్డిని మంత్రి అదేశించారు.

నిజామాబాద్‌ జిల్లాలో ఆయకట్టు రైతులకు సాగు నీరు అందించడం కోసం గుత్పా, అలీసాగర్‌,లక్ష్మి కెనాల్‌,చౌట్పల్లి హన్మంతు రెడ్డి తదితర లిఫ్ట్‌లకు అట్లాగే కాకతీయ కెనాల్‌ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు సిద్దం చేయాలని సి.ఈ మధుసూధన్‌ రావును అదేశించారు. నిజాంసాగర్‌లో 5టిఏంసిల నీటి నిల్వలు ఉండగా వానాకాలం సాగు కోసం రైతులకు నీటిని విడుదల చేయాలని సీఎం కేసిఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి కామారెడ్డి సి.ఈ శ్రీనివాస్‌ రెడ్డిని అదేశించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »