ఆర్మూర్, జూలై 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛకాలనీ సమైక్యకాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీవాసులు రెండు గంటలు శ్రమదానం చేసి కాలనీలో రోడ్లను, మురుగు కాలువలను శుభ్రం చేశారు. చీపుర్లతో రోడ్లపై చెత్తాచెదారం ఊడ్చేశారు. పారలు పట్టుకొని పిచ్చిమొక్కలు, ముళ్ళ చెట్లను తొలగించారు.
మురుగు కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు, రాళ్ళు రప్పలను, చెత్తా చెదారాన్ని తొలగించి, పూడిక తీసి మురుగు నీరు వెళ్ళిపోయేలా చేశారు. జర్నలిస్ట్ కాలనీని పరిశుభ్రంగా ఉంచడానికి గత ఆరు వారాలుగా ప్రతి ఆదివారం స్వచ్చకాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అభివృద్ధికమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పురపాలక చైర్ పర్సన్ పండిత్ వినీత చేతుల మీదుగా స్వచ్ఛ కాలనీ అవార్డు అందుకున్నామని ఆయన పేర్కొన్నారు.
అవార్డుకు కారకులైన కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న, సుంకే శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఘనపురం సంతోష్, కార్యదర్శులు కొంతం రాజు, లోచారం సాయన్న, కానిస్టేబుల్ ప్రసాద్, ప్రదీప్, ఎల్ టీ కుమార్, సదమస్తుల గణపతి, బాస మోహన్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.