ఆర్మూర్, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదాత చేపూర్ గ్రామ వాస్తవ్యులు శెట్టి కిషన్ ఆధ్వర్యంలో ‘‘గురు పౌర్ణమి’’ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసి బాల నర్సయ్య, ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు, కోశాధికారి సురేష్ రుక్మాజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన శెట్టి కిషన్‌కు ఆలయ కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. ఎవరైనా తమ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించాలనుకుంటే, ఆలయ కమిటీకి 6 వేలు చెల్లించాలని, వివరాలకు క్యాషియర్ సురేష్ రుక్మాజి నంబర్‌కు 9885061261 ఫోన్‌చేసి సంప్రదించాలన్నారు.
అలాగే చేపూర్ సాయిబాబా ఆలయ ఆవరణలో పెళ్ళిళ్లు, శుభ కార్యాలు చేసేవారి కొరకు కూడా ప్రత్యేకంగా కళ్యాణ మండపం, వంటగది, నీటి వసతి, మూత్రశాలలు, ఇతరత్రా సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఎవరైనా తక్కువ ఖర్చులతో శాఖాహార కార్యక్రమాలు నిర్వహించుకునేవారు సురేష్ రుక్మాజిని సంప్రదించగలరని, ఆలయ కమిటీ వారు తెలిపారు.
కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్ .అశోక్, ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్, సలహాదారులు కత్తి శ్రీను, బి.సాయన్న, ఎం.గిరీష్, దేవిదాస్, స్వామిదాస్, పూజారి పంతుళ్ళు కిరణ్ కుమార్ జోషి, కిరీటి జోషి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,చేపూర్ గ్రామ ప్రజలు, చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.