ఆర్మూర్, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నవనాతపురం ఆధ్వర్యంలో సోమవారం రాం మందిర్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు.
పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు నిత్యం ఉపయోగించుకోవాలని జూట్ సంచులు పంచారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్‌కు ఒక లక్ష ప్లాస్టిక్ సంచులు వాడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్లాస్టిక్ భూమిలో కలసిపోయి చుక్క నీరు కూడా భూమిలో ఇనుక కుండా చేస్తుందని, ప్లాస్టిక్ భూమిలో కలసిపోవడానికి వెయ్యి యేండ్లు పడుతుందని, అందుకని ప్లాస్టిక్‌ని నిషేదించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం, లయన్స్ క్లబ్ కార్యదర్శి రఫీద్దీన్, మ్యాదరి రాజన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.