కామరెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పి సీఈవో సాయా గౌడ్, ఏవో రవీందర్, జిల్లా ఎన్నికల విభాగం అధికారి సాయి భుజంగరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.