కామారెడ్డి, జూలై 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, పొడు భూముల పట్టాల పంపిణీ, పెట్టుబడి సాయం, రెండో విడత గొర్రెల పంపిణీ, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం లబ్ధిదారుల ఎంపిక, ఆయిల్ ఫామ్ సాగు, యాసంగి ధాన్యం కొనుగోలు వంటి అంశాలపై సిఎస్ శాంతి కుమారి వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ లో సోమవారం మాట్లాడారు. జిల్లాలో హరితహారం ద్వారా 28.60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1.70 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. నాలుగు లక్షల మొక్కలు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎఫ్వో నిఖిత, డిపిఓ శ్రీనివాసరావు, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.