మాక్లూర్, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ మాక్లూర్ మండలం అమ్రాధ్ గ్రామంలో మహా జన్ సంపార్క్ అబియన్లో భాగంగా గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగన్న మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు.
మరోసారి మోడీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలు బిజెపికి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, మండల అధ్యక్షులు కలగడ్డ వినోద్ కుమార్, జిల్లా నాయకులు గంగోని సంతోష్, శ్రీను, గంగోనీ వినోద్, పాన్ శీను, కృష్ణ గౌడ్, ఉదయ్ గౌడ్, విజయానంద్, కిరణ్, మాధరి రాజేశ్వర్, కిషన్ మోర్చ మండల అధ్యక్షులు నల్ల గంగ మోహన్, బూత్ అధ్యక్షులు రమేష్, ఓం ప్రకాష్, ప్రభాకర్, ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు రవి గౌడ్, రమేష్ నాయక్, సురేష్, కలిగోట ప్రశాంత్, హరీష్, కార్యకర్తలు పాల్గొన్నారు.