కామారెడ్డి, జూలై 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నారు.
రెక్క ఆడితే కానీ డొక్కాడని సామాన్య ప్రజలకు కూరగాయల అధిక ధరల వల్ల భారం అవుతుందన్నారు. అల్లం, ఎల్లిగడ్డ ధరలు కూడా 200 రూపాయలు దాటిన పరిస్థితి ఉందని, మిర్చి కిలో 180, టమోటా 140 కిలో, ఏ కూరగాయలైనా 80 రూపాయలకు తక్కువ కాకుండా ఉన్నాయన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 రూపాయలు ఉన్న ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఇంత రేటు కొండెక్కిన గాని పట్టించుకోకుండా సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.