కామారెడ్డి, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఆంటీ రేబిస్ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత యాంటీ రాబిస్ టీకాలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పెంపుడు జంతువుల పట్ల ప్రేమ భావాన్ని పెంచుకోవాలని తెలిపారు. పెంపుడు జంతువుల పట్ల పిల్లలు ద్వేషం పెంచుకోవద్దని సూచించారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి టీకాలు వేయించుకొని రేబిస్ వ్యాధిని నివారించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్తక శాఖ అధికారి సింహరావ్, వైద్యులు విజయ భాస్కర్, దేవేందర్, సంజయ్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.