జక్రాన్‌పల్లి, జూలై 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో పేదవాళ్లకు దేవుడయ్యాడని గుర్తుచేశారు.
కార్యక్రమంలో జక్రాన్‌పల్లి మండల యువజన విభాగం అధ్యక్షులు సొప్పరి వినోద్, మండల యువ నాయకులు ప్రణయ్, మైనార్టీ అధ్యక్షులు షాదుల్లా, గన్యతండా కాంగ్రెస్ అధ్యక్షుడు పీర్‌సింగ్, రాజేష్, సాయిచ, రవి, హరిచంద్, వినోద్, అనిల్, నిజామాబాద్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు సొప్పరి సుధీర్, ప్రేమ్ కుమార్, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.