కామారెడ్డి, జూలై 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన లావణ్య (22) రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారికి కావాల్సిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని శ్రావణ్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందించారని, అదేవిధంగా స్వరూప (60) మహిళ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి అత్యవసరంగా బి పాజిటివ్ సింగిల్ ఓనర్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని జలిగామ సూర్య మోహన్ వెంటనే స్పందించి సకాలంలో అందజేసి ప్రాణదాతలుగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఎల్లవేళలా ఆపదలో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తలసేమియా చిన్నారులకు కొండంత అండగా నిలిచి 1073 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందని త్వరలోనే మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి తలసేమియా చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేస్తామన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అవసరమైనట్లయితే 9492874006 నెంబర్ కి సంప్రదించాలన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ అధ్యక్షులు ఐవిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్ రవి, కామారెడ్డి బ్లడ్ సెంటర్ నిర్వాహకులు జీవన్, వెంకట్, సంతోష్ పాల్గొన్నారు.