Daily Archives: July 10, 2023

దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హల్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డిఆర్డిఓ సాయన్నలతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో …

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్‌ వాయి ప్రభుత్వ షెడ్యూల్‌ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్‌ పంపిణి చేశారు. అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్‌ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం …

Read More »

వసతిగృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర, బాలికల హాస్టల్‌ను ప్రొఫెసర్‌ యాదగిరి, రిజిస్ట్రార్‌ తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తెలిపారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి హాస్టల్స్‌ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిస్కార మార్గాలను వివరించారు. రిజిస్టర్‌ వెంట హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌ డా. మహేందర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్టేట్‌ …

Read More »

ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 215 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌, మెప్మా పీ.డీ రాములు, …

Read More »

మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం సమ్మె ప్రారంభించారు. సమ్మెను ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెండిరగ్లో ఉన్న తొమ్మిది నెలల బకాయి బిల్లులు, 18 నెలల కేసీఆర్‌ …

Read More »

బీసీ రాజకీయ ప్లీనరి పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న శనివారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరగనున్న ‘‘బీసీల రాజకీయ ప్లీనరి’’ కార్యక్రమ పోస్టర్లను నిజామాబాద్‌ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ మాట్లాడుతూ బీసీలందరు కులాలకు అతీతంగా ఏకమైన నాడే …

Read More »

జాతీయ నులిపురుగుల దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ నులిపురుగుల దినోత్సవం (జూలై 20) కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను, ఆల్బెండజోల్‌ మాత్రలను ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్సు హాల్‌లో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుదర్శన్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.అశోక్‌ తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో 0 నుండి 19 సంవత్సరాల వయసుగల …

Read More »

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బాన్సువాడ, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని 13 వార్డులో సోమవారం నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులను మున్సిపల్‌ చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా టీచర్స్‌ కాలనీ వారం తప్పు సంతకు వెళ్లేందుకు సీసీ రోడ్డు పనులకు సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం జూలై 10, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : అష్టమి రాత్రి 9.32 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.12 వరకుయోగం : అతిగండ సాయంత్రం 6.17 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి కౌలువ రాత్రి 9.32 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.42 – 2.14దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.30 – 1.22, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »