దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హల్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, డిఆర్డిఓ సాయన్నలతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండిరగ్‌ ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడి దయానంద్‌, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »