బాన్సువాడ, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 13 వార్డులో సోమవారం నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా టీచర్స్ కాలనీ వారం తప్పు సంతకు వెళ్లేందుకు సీసీ రోడ్డు పనులకు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిధులు మంజూరు చేయడంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని సిసి రోడ్డును నాణ్యత ప్రమాణాలతో పనులు చేయాలని ఆయన సంబంధిత గుత్తేదారుకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.