కామారెడ్డి, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్ వాయి ప్రభుత్వ షెడ్యూల్ కులాల వసతి గృహంలో ఎంపీపీ దశరథ రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు, నోటు బుక్కులు, నూతన వస్త్రాలు పంపిణి, పర్నిచర్ పంపిణి చేశారు.
అనంతరం వారు మాట్లాడుతు ఎమ్మెల్యే సురేందర్ కృషితో వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు గాను 150 మంది అదనంగా వచ్చినట్లు తెలిపారు. సన్నబియ్యం పౌష్టికహారం నాణ్యమైన విద్య అందిస్తున్నమన్నారు. సమైక్య రాష్ట్రములో పురుగుల అన్నం చాలీచాలని అర్ద ఆకలితో విద్యార్థులు పస్తులుండేవారని గుర్తుచేశారు. ప్రతిపక్షం నాయకులు వారు పరిపాలించే రాష్ట్రాలని పరిశీలన చేయాలని చేతగాని దద్దమ్మలాగ ఏది పడితే అది గాలి మాటలు మాట్లాడవద్దని హితావు పలికారు.
గురుకుల పాఠశాల తాడ్వాయిలో చదువుకున్న కుమారి మాలావత్ పూర్ణ అతి చిన్న వయసు 8వ తరగతిలో వున్నప్పుడే ఎవరెస్టు శిఖరం ఎక్కినారని అలాగే ఖమ్మం జిల్లా ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదువుకున్న ఆనంద్ అతి చిన్న వయసు 8వ తరగతిలోనే ఎవరెస్టు శిఖరము ఎక్కినారని వారిని ఆదర్శంగా తీసుకోని విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని తెలిపారు.
కార్యక్రమంలో మండలం రైతుబంధు అధ్యక్షులు నారాయణ రెడ్డి, స్థానిక సర్పంచ్ గంగారాం, స్థానిక ఎంపీటీసీ ఉమాదేవి దత్తాద్రి, బిఆర్‌ఎస్ మండలం అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, ఉప సర్పంచ్ సరస్వతి, వార్డెన్ మమత నర్సిములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.