నిజామాబాద్, జూలై 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న శనివారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న ‘‘బీసీల రాజకీయ ప్లీనరి’’ కార్యక్రమ పోస్టర్లను నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీలందరు కులాలకు అతీతంగా ఏకమైన నాడే మన హక్కులు సాధించుకుంటామని అన్నారు. బీసీలు 60 శాతం ఉన్నాగాని ఇంకా వెనకబడి ఉండడానికి కారణం రాజకీయంగా సరైనా అవకాశాలు రాకపోవడమే అన్నారు. బీసీలు ఎదగాలంటే రాజకీయ అవకాశాలు రావాలని అన్నారు.
బీసీలు రాజకీయంగ ఎదగడానికి ప్లీనరి అవకాశం ఇస్తదన్నారు. ప్లీనరి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి అందరు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దర్శనం దేవేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, గంగాధర్, బసవ కుమార్, దయానంద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.