సదాశివనగర్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్‌ఎస్ నాయకులు రైతులు కలిసి రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. …
Read More »Daily Archives: July 11, 2023
జనాభా నియంత్రణ అందరి బాధ్యత
నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిజామాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ మీదుగాటీఎన్జీవో సుభవన్ వరకు కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ …
Read More »గల్ఫ్‌లో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పురం సిద్ది రాములు, గత కొన్ని రోజుల క్రితం గల్ఫ్ దేశంలో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట రామారెడ్డి జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ సర్పంచ్ …
Read More »దళిత సమాజం అంతటికీ దశల వారీగా దళితబంధు
నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళిత జాతి అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేసే మహనీయ వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రతి దళిత కుటుంబం పైకి రావాలనే తపనతో ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి …
Read More »దోమతెరల పంపిణీ
బోధన్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు మంగళవారం దోమ తెరలు పంపిణి చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణం అజాంగంజ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి దోమతెరలు పంపిణీ చేశారు. వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కవగా వస్తాయి కాబట్టి చిన్న పిల్లలను దోమకాటు వ్యాధుల …
Read More »ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ రెగ్యులర్, బ్యాక్‌లాక్ సెమిస్టర్ పరీక్షలో 3 వేల 158 మంది విద్యార్థులకు గాను 2 వేల 744 మంది హాజరయ్యారని, 414 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »మెడికల్ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మెడికల్ కళాశాల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మెడికల్ కళాశాల నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా …
Read More »ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళలకు అందుతున్న ఎనిమిది రకాల వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం …
Read More »మరో మూడు రోజులు వర్షాలు
హైదరాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో చాలాచోట్ల సోమ మంగళ, బుధవారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఆవర్తనం ఏర్పడి సగటు సముద్ర మట్టం నుంచి 5.8 …
Read More »సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు సెల్ ఫోన్ అందజేసిన సిఐ
బాన్సువాడ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెల్‌ఫోన్లు పోయాయని దరఖాస్తు చేస్తున్న బాధితులకు బాన్సువాడ పట్టణంలోని పోలీస్‌స్టేషన్లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మంగళవారం టౌన్ సిఐ మహేందర్ రెడ్డి సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ దుకాణ యజమానులు ఫోన్లు అమ్మడానికి ప్రయత్నించిన వారి యొక్క సమాచారం పోలీసులకు తెలియజేయాలని, అలాగే పరిచయంలేని వ్యక్తుల వద్ద ఫోన్లు కొనుగోలు చేసి …
Read More »