గాంధారి, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలోని కేటీఎస్ ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకపోగ, ప్రైవేటు పాఠశాలలో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్ పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలలో ఇష్ట రాజ్యాంగ ఫీజులు వసూలు చేస్తుండడంతో, ఫీజులను నియంత్రించే విధంగా ఫీజు నియంత్రణ చట్టం తేవాలని బుధవారం వామపక్ష విప్లవ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు తలపెట్టే విద్యాసంస్థల బందును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న కేటీఎస్ పాఠశాలలో మండల అధికారులు పాఠ్యపుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రేమ్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు మోజిరం, నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.