బాన్సువాడ, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెల్ఫోన్లు పోయాయని దరఖాస్తు చేస్తున్న బాధితులకు బాన్సువాడ పట్టణంలోని పోలీస్స్టేషన్లో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మంగళవారం టౌన్ సిఐ మహేందర్ రెడ్డి సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ దుకాణ యజమానులు ఫోన్లు అమ్మడానికి ప్రయత్నించిన వారి యొక్క సమాచారం పోలీసులకు తెలియజేయాలని, అలాగే పరిచయంలేని వ్యక్తుల వద్ద ఫోన్లు కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు పోర్టల్ ద్వారా పోయిన ఫోన్లను తిరిగి ఇవ్వడంతో మొబైల్ ఫోన్ బాధితులు ఆనందపడ్డారు. ఫోన్లో రికవరీ కోసం కృషిచేసిన సిబ్బంది రాజేష్, స్వామిలను ఆయన అభినందించారు.