బోధన్, జూలై 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు మంగళవారం దోమ తెరలు పంపిణి చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణం అజాంగంజ్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి దోమతెరలు పంపిణీ చేశారు.
వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కవగా వస్తాయి కాబట్టి చిన్న పిల్లలను దోమకాటు వ్యాధుల బారిన పడకుండా దోమ తెరలు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాస్కర్ రాజ్, కెకెసి నిజామాబాద్ జిల్లా చైర్మన్, ఖాజా ఫయాజొద్దిన్, మాజీ కౌన్సిలర్, లొల్లి పర్వయ్య (న్యాయవాది), ఖాళీల్ ఉల్లా, యాసిన్, మోసిన్, రాజశేఖర్, రిత్విక్ తదితరులు పాల్గొన్నారు.